వరల్డ్‌ టాప్‌-10 ధనవంతుల జాబితాలో చేరిన ముకేశ్‌ అంబానీ

Mukesh Ambani, Mukesh Ambani In Top 10 Richest Persons Club, Mukesh Ambani Joins World Top-10 Richest Persons Club, Reliance Industries, Reliance Industries Chairman, Reliance Industries Chairman Mukesh Ambani, Top 10 Richest Persons Club, World Top 10 Richest Persons Club

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. తాజాగా ఆయన ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల జాబితాలోకి చేరారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్ విలువ రూ.64.5 బిలియన్‌ డాలర్లు దాటడంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 9 వ స్థానానికి చేరుకున్నారు. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రుణ రహిత సంస్థగా మారినట్లు ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రకటించారు. రిలయన్స్ జియోలో కొంత వాటా విక్రయాలు ద్వారా గత రెండు నెలల్లోనే రూ.1.69 లక్షల కోట్లను ముకేశ్ అంబానీ సమీకరించారు. ముందుగా మార్చి 2021 లోగా రిలయన్స్ సంస్థను రుణ రహితంగా మార్చాలని ముకేశ్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సంస్థలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + four =