కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

Karnataka government withdraws night curfew, Karnataka Govt, Karnataka govt withdraws Covid-induced night curfew, Karnataka Govt Withdraws Night Curfew, Karnataka Govt Withdraws Night Curfew from Today, Karnataka Govt Withdraws Night Curfew from Today which Enforced due to Covid-19, Karnataka withdraws night curfew imposed due to Covid-19, Karnataka withdraws night curfew with immediate effect, Mango News

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో జూలై 3, 2021 నుండి నైట్ కర్ఫ్యూ అమలు అవుతుండగా, నేటితో (నవంబర్ 5, 2021) ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు తెలిపారు.

మరోవైపు కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా హార్స్ రేసింగ్‌ కు కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. హార్స్ రేసింగ్ వెన్యూలో సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే రేసింగ్ పాట్రన్లను అనుమతించాలని, అలాగే రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారినే హార్స్ రేసింగ్ వెన్యూలలోకి అనుమతించాలని తాజా ఆదేశాల్లో కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =