లాక్‌డౌన్ ముందు–తర్వాత: తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య

Corona Cases Before and After Lockdown, Corona Cases Before and After Lockdown In Telangana, Corona Positive Cases Details in Telangana, Corona Positive Cases in Telangana, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths

తెలంగాణ రాష్ట్రంలో ‌గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 21, ఆదివారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వలన ఇప్పటివరకు 210 మంది మరణించగా, 3731 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3861 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే లాక్‌డౌన్‌ ముందు, నాలుగు విడతల లాక్‌డౌన్ సమయంలో, జూన్ 1 నుంచి మొదలైన అన్‌లాక్‌ 1.0 సందర్భంగా రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయనే అంశాలను బులెటిన్ లో తెలియజేశారు.

లాక్‌డౌన్ ముందు – లాక్‌డౌన్ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు వివరాలు( జూన్ 21 వరకు) :

  • లాక్‌డౌన్ ప్రారంభం కాకముందు (మార్చ్ 22 వరకు) – 22
  • లాక్‌డౌన్ 1.0 (మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 14) – 622
  • లాక్‌డౌన్ 2.0 (ఏప్రిల్ 15 నుంచి మే 3) – 438
  • లాక్‌డౌన్ 3.0 (మే 4 నుంచి మే 17) – 469
  • లాక్‌డౌన్ 4.0 (మే 18 నుంచి మే 31) – 1147
  • అన్‌లాక్‌ 1.0 జూన్ 1 నుంచి – 5104

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =