ఇండియా గేటు వద్ద సమావేశాలకు అనుమతి లేదు, సెక్షన్ 144 విధింపు

Delhi Police imposes Section 144 around India Gate, national news, national news today, No Gathering Permissible Around India Gate, No gatherings allowed around India Gate, section 144 at india gate, Section 144 imposed, Section 144 Imposed Around India Gate

దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రకటించారు. సెక్షన్ 144 లోని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి) ప్రకారం ఇండియా గేట్ వద్ద ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఒకేసారి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను సమావేశం కావడాన్ని నిషేధిస్తునట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 28 న పంజాబ్ యూత్ కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది నేతలు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే యూపీలోని హథ్రాస్‌ లో యువతిపై చోటుచేసుకున్న ఘటనపై ధర్నాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా సమావేశాలను నిషేధించి సెక్షన్ 144 విధించినట్టు తెలుస్తుంది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద 100 మందితో సమావేశాలు అనుమతించబడతాయని, అది కూడా సంబంధిత అధికార యంత్రాంగం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఢిల్లీ డీసీపీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 4 =