సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక సమావేశం.. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరికపై నేడు నిర్ణయం?

Sonia Gandhi To Hold Key Meet Today with Congress Senior Leaders Over Prashant Kishor Joining, Sonia Gandhi To Hold Key Meet Today Over Prashant Kishor Joining, Sonia Gandhi To Hold Key Meet Today with Congress Senior Leaders, Sonia Gandhi, President of Indian National Congress, Sonia Gandhi President of Indian National Congress, Indian National Congress, Prashant Kishor Joining In Indian National Congress, Prashant Kishor Joining In INC, Sonia Gandhi To Hold Key Meet, Sonia Gandhi To Hold Key Meet Today with Congress Senior Leaders, prominent Poll Strategist Prashant Kishor, Prashant Kishor, prominent Poll Strategist, Poll Strategist Prashant Kishor News, Poll Strategist Prashant Kishor Latest News, Poll Strategist Prashant Kishor Latest Updates, Mango News, Mango News Telugu,

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై సీనియర్ నేతలతో ఈరోజు సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్‌లో చేరడంపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈరోజు (ఏప్రిల్ 25) కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరే ప్రతిపాదనను పరిశీలించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ తన నివేదికను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించనుంది. కమిటీ సభ్యులు కెసి వేణుగోపాల్, దిగ్విజయ సింగ్, అంబికా సోని, రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, మరియు ప్రియాంక గాంధీ వాద్రాలతో సోనియా గాంధీ నేడు 10 జన్‌పథ్‌లో సమావేశమవనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం ప్రశాంత్ కిషోర్ రూట్ ప్లాన్ ఇచ్చారని, దీనిపై సమగ్ర విశ్లేషణ నిర్వహిస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన ప్రకారం.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 370 స్థానాల్లో పోటీ చేయాలని, మిగిలిన స్థానాలలో రాష్ట్రాలలో స్నేహపూర్వక పార్టీలతో పొత్తులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా.. పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు వచ్చే ఏడాది కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్, సోనియాకు వ్యూహాత్మక సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ప్రత్యక్ష పోటీదారులుగా ఉన్న పార్టీలతో పొత్తుల సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగనుంది. ఉదాహరణకు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వంటి వారితో కలిసి సాగాలని ప్రశాంత్ కిషోర్ సూచించారని పార్టీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. వీటన్నింటిపై ఈరోజు జరుగనున్న సమావేశంలో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here