రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Vice President Venkaiah Naidu Four-Days Tour of Nellore District From Tomorrow, Venkaiah Naidu Four-Days Tour of Nellore District From Tomorrow, Vice President Venkaiah Naidu Four-Days Tour of Nellore District, Vice President M Venkaiah Naidu to visit Nellore for Four-Days, Venkaiah Naidu Vice President Of India To tour in Nellore district, Vice President Venkaiah Naidu Nellore Tour, Venkaiah Naidu Nellore Tour, Venkaiah Naidu Nellore Tour For Four-Days, Vice President Venkaiah Naidu Four-Days Tour To Nellore, Vice President Venkaiah Naidu, Venkaiah Naidu, Vice President, Vice President Of India, Vice President Of India Venkaiah Naidu, Venkaiah Naidu Nellore Tour News, Venkaiah Naidu Nellore Tour Latest News, Venkaiah Naidu Nellore Tour Latest Updates, Mango News, Mango News Telugu,

భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు రేపు జిల్లాలోని వెంకటాచలంకు రానున్నారు. ఏప్రిల్ 27వ తేదీన నెల్లూరులోని ‘ఆకాశవాణి’ ఎఫ్‌ఎం స్టేషన్‌లో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన టవర్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత, ఉపరాష్ట్రపతి ఆకాశవాణి స్టేషన్‌లో ‘హై టీ’ సందర్భంగా నెల్లూరులోని ప్రముఖులతో సంభాషిస్తారు. ఫిబ్రవరి 21, 2019న ఇక్కడి రేడియో స్టేషన్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం అల్లూరు లోని దేవిరెడ్డి శారద స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. తర్వాతి రోజు ఏప్రిల్ 28వ తేదీన వెంకయ్య నాయుడు స్వయంగా స్థాపించిన, ‘స్వర్ణభారత్ ట్రస్ట్’ (ఎస్‌బీటీ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

సరైన విద్య, ఉపాధి అవకాశాలు లేని గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో సాధికారతను ప్రోత్సహించడానికి, ఎస్‌బీటీ 2003లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో ‘గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం’ స్థాపించింది. ఇక్కడ స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. వృత్తి, విద్యా కోర్సులలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి యువతకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రతి యేడాది ‘స్వర్ణభారత్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో కొన్ని వందల మందికి స్వయం ఉపాధికి తగిన తర్ఫీదునిస్తున్నారు. తిరిగి ఏప్రిల్ 29వ తేదీ ఢిల్లీకి వెళ్ళనున్నారు. కాగా ఉపరాష్ట్రపతి పర్యటనకు ముందు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ సిహెచ్ విజయరావుతో కలిసి ఆదివారం అల్లూరు మండలంలోని వెంకటాచలం రైల్వేస్టేషన్‌తో పాటు స్వర్ణ భారతి ట్రస్ట్, దేవిరెడ్డి శారద ట్రస్టు రేడియో స్టేషన్‌లోని అన్ని విభాగాలను పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + nine =