కుల్ భూషణ్ జాదవ్ కేసులో నేడే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు

Ground Report ICJ Kulbhushan Jadhav case, ICJ Decision Unlikely to be Unanimous, ICJ To Pronounce Verdict In Kulbhushan Jadhav Case Today, ICJ Verdict in Kulbhushan Jadhav case likely today, Kulbhushan Jadhav Case ICJ to Pronounce Verdict today, Mango News, World Court To Pronounce Verdict In Kulbhushan Jadhav Case Today

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. 2016, మార్చి 3 న పాకిస్తాన్ భద్రతా దళాలకు కుల్ భూషణ్ జాదవ్ చిక్కాడు, ఆ తరువాత గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్ లో మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం జేస్తూ, పాక్ వైఖరి పై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అభ్యర్థన స్వీకరించిన ఐసిజే తాము తదుపరి తీర్పు ఇచ్చేంతవరకు మరణ శిక్షను నిలిపివేయాలని పాకిస్తాన్ ను ఆదేశించింది.

అంతర్జాతీయ న్యాయస్థానం ఈ కేసులో విచారణ నిర్వహించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల వాదనలు విని కీలక ఆధారాలను సేకరించింది. ఈ తీర్పు ది హేగ్ కాలమానం ప్రకారం బుధవారం 3 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు వెలువడనుంది. హేగ్ లో శాంతి సౌధంలో తీర్పు వెలువరించనున్నారు,ఈ నేపథ్యంలో పాక్ న్యాయవాదులు, భారత బృందం అక్కడికి చేరుకున్నారు. ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయి.

 

[subscribe]
[youtube_video videoid=uPKblPRj3fY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =