గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది కాంగ్రెస్ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే…

Gujarat Assembly Elections 2022: Congress Releases List of 40 Star Campaigners,Gujarat Assembly Elections 2022,Congress Releases List 40 Star Campaigners,Mallikarjun Kharge, UPA Chairperson Sonia Gandhi, Party MP Rahul Gandhi, General Secretary Priyanka Gandhi Vadra, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh CM Bhupesh Baghel, Digvijay Singh, Kamal Nath, Bhupender Singh Hooda, Ashok Chavan, Tariq Anwar, Pawan Khera, Sachin Pilot, Jignesh Mevani, Kanhaiya Kumar,Mango News,Mango News Telugu

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1వ తేదీన 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో భాగంగా డిసెంబర్ 5వ తేదీన 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 40 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు ఆ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.

ఈ జాబితాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాఘేల్, దిగ్విజయ్ సింగ్, కమలనాథ్, భూపేందర్ సింగ్ హూడా, అశోక్ చవాన్, తారిఖ్ అన్వర్, పవన్ ఖేరా, సచిన్ పైలట్, జిగ్నేష్ మేవానీ, కన్హయ్య కుమార్, తదితరులు ఉన్నారు. కాగా గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =