ధోని లేని సచిన్ ప్రపంచకప్ జట్టు

Five Indians in Sachin Tendulkar, Kane Williamson over Virat Kohli as captain By Tendulkar, Mango News, No Dhoni In Sachin Tendulkar World Cup XI, Sachin Tendulkar picks his team of the tournament, Sachin Tendulkar picks Jonny Bairstow over MS Dhoni in his World Cup, Tendulkar Includes Five Indians Leaves Out MS Dhoni

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌ 2019, మే 30 న ప్రారంభమై, జూలై 14 న జరిగిన అద్భుతమైన మ్యాచ్ తో ముగిసింది. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించి, విజేతగా నిలిచింది. అయితే ప్రపంచ కప్ ముగిసిన సందర్భంగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అధికారిక ప్రసారకర్తలకు వ్యాఖ్యానం చేస్తున్నపుడు ప్రపంచకప్ లో ఆడిన ఆటగాళ్ల నుంచి పదకొండు మందిని తన జట్టుగా ప్రకటించాడు. సచిన్ జట్టులో భారత ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు, విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ, బుమ్రా, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా సచిన్ జట్టులో చోటు పొందారు. అయితే వికెట్ కీపర్ స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బదులు, ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ని ఎంచుకున్నాడు. మరో వైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను తన జట్టు కెప్టెన్ గా ప్రకటించాడు.

సచిన్ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here