పారాలింపిక్స్‌ లో భారత్ కు మరో పతకం, హైజంప్‌ లో రజత పతకం సాధించిన ప్రవీణ్‌ కుమార్‌

Tokyo Paralympics, Praveen Kumar Wins Silver In Men's High Jump T64, Medals Count Reach to 11, Mango News, Latest Breaking News 2021, Para Athlete, Tokyo Paralympics 2021, Tokyo Paralympics Updates, High Jumper Praveen Kumar, High Jump World Record, Men High Jump T64 final, Tokyo Paralympics Games, Praveen Kumar wins a silver medal, high-jumper Praveen Kumar 11th Medal

టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం నాడు పురుషుల హైజంప్‌ T-64 ఈవెంట్ లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించాడు. 18 ఏళ్లకే భారత్ తరపున పారాలింపిక్స్ లో పతకం గెలిచిన క్రీడాకారుడిగా ప్రవీణ్‌ కుమార్‌ ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2.07 మీటర్లు జంప్ చేసి ఆసియా రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్ రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు పారాలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య 11 కు (రెండు స్వర్ణం, ఆరు రజతం, మూడు కాంస్యాలు) చేరుకుంది. మరోవైపు హైజంప్‌లో భారత్ ఇప్పటికి మూడు పతకాలను సాధించింది. మరియప్పన్‌ తంగవేలు రజతం, శరద్ కుమార్‌ కాంస్య పతకాలను గెలుచుకోగా, తాజాగా ప్రవీణ్‌ కుమార్‌ రజతాన్ని సొంతం చేసుకున్నాడు.

పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అతని విజయం పట్ల గర్వంగా ఉందని, అతని కృషి మరియు అసమానమైన అంకితభావం యొక్క ఫలితమే ఈ పతకమని చెప్పారు. ప్రవీణ్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 18 =