యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్-2023 విడుదల, సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్‌, మెయిన్స్ ఎప్పుడంటే?

UPSC Annual Exam Calendar-2023 Released, UPSC annual exam schedule for the year 2023 has been released, Civil Services Preliminary Exam 2023 will be conducted on May 28 2023, UPSC Exam 2023, UPSC Calendar 2023 has been released, UPSC releases exam calendar for 2023, UPSC Annual Exam Calendar, 2023 UPSC Annual Exam Calendar, Civil Services Preliminary Examination 2023, 2023 Civil Services Preliminary Examination, Civil Services Preliminary Examination, UPSC Annual Exam Calendar News, UPSC Annual Exam Calendar Latest News, UPSC Annual Exam Calendar Latest Updates, Mango News, Mango News Telugu,

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) బుధవారం నాడు 2023 సంవత్సరానికి సంబంధించి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. యూపీఎస్సీ వార్షిక పరీక్ష క్యాలెండర్ ను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచారు. ఈ షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 28, 2023న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2023న విడుదల కానుండగా, దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 21, 2023 ను చివరి తేదీగా ప్రకటించారు. అలాగే సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష సెప్టెంబర్ 15, 2023న నిర్వహించబడుతుందని తెలిపారు.

యూపీఎస్సీ వార్షిక పరీక్ష క్యాలెండర్-2023:

  1. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – జనవరి 15, 2023 (ఆదివారం)
  2. ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2023 – ఫిబ్రవరి 19, 2023 (ఆదివారం)
  3. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2023 – ఫిబ్రవరి 19, 2023 (ఆదివారం)
  4. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – ఫిబ్రవరి 19, 2023 (ఆదివారం)
  5. సీబీఐ (డీఎస్పీ) ఎల్డీసీఈ, 2023 – మార్చి 11, 2023 (శనివారం నుంచి రెండు రోజులు)
  6. సీఐఎస్ఎఫ్ ఏసీ(ఈఎక్స్ఈ) ఎల్డీసీఈ-2023 – మార్చి 12, 2023 (ఆదివారం)
  7. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – మార్చి 12, 2023 (ఆదివారం)
  8. ఎన్.డి.ఎ అండ్ ఎన్.ఏ. పరీక్ష (I), 2023, సీ.డీ.ఎస్. పరీక్ష (I), 2023 – ఏప్రిల్ 16, 2023 (ఆదివారం)
  9. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – మే 28, 2023 (ఆదివారం)
  10. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష- మే 28, 2023 (ఆదివారం)
  11. ఐ.ఈ.ఎస్/ఐ.ఎస్.ఎస్ పరీక్ష, 2023 – జూన్ 23, 2023 (శుక్రవారం నుంచి మూడు రోజులు)
  12. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్ష, 2023 – జూన్ 24, 2023 (శనివారం నుంచి రెండు రోజులు)
  13. ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2023 – జూన్ 25, 2023 (ఆదివారం)
  14. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – జూలై 2, 2023 (ఆదివారం)
  15. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2023- 16.07.2023 (ఆదివారం)
  16. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (ఏసీలు) పరీక్ష, 2023- 06.08.2023 (ఆదివారం)
  17. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – ఆగష్టు 20, 2023 (ఆదివారం)
  18. ఎన్.డి.ఎ. అండ్ ఎన్.ఏ. పరీక్ష (II), 2023, సీ.డీ.ఎస్. పరీక్ష (II), 2023 – సెప్టెంబర్ 03, 2023 (ఆదివారం)
  19. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2023- సెప్టెంబర్ 15, 2023 (శుక్రవారం నుంచి ఐదు రోజులు )
  20. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – అక్టోబర్ 08, 2023 (ఆదివారం)
  21. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష, 2023- నవంబర్ 26, 2023 (ఆదివారం నుంచి 10 రోజులు)
  22. ఎస్.ఓ/స్టెనో (జీడీ-బి/జీడీ-I) ఎల్డీసీఈ – డిసెంబర్ 12, 2023 (శనివారం నుంచివ 2 రోజులు)
  23. యూపీఎస్సీ ఆర్టీ/పరీక్షల కోసం రిజర్వ్ చేయబడింది – డిసెంబర్ 17, 2023 (ఆదివారం)

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =