వెస్టిండీస్ టూర్ కోసం భారత జట్ల ఎంపిక

BCCI Announced Indian Team For West Indies Tour, BCCI announces Indian squads for West Indies tour, Highlights India squad for West Indies tour 2019 announcement, india national cricket team: BCCI announces team for West Indies tour, India tour of West Indies 2019, Mango News, Team India for tour of West Indies announced

ఆగస్ట్ 3 నుంచి జరగనున్న వెస్టిండీస్ టూర్ 2019 లో ఆడనున్న భారత జట్టును జూలై 21 న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మేస్కె ప్రసాద్ ప్రకటించారు. ముంబయిలో జరిగిన సమావేశం తరువాత, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మరియు మూడు టి20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడబోయే భారత జట్లను ప్రకటించాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహించడానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసారు. అయితే ఊహించిన విధంగానే గైర్హాజరీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోని ని, విశ్రాంతి కోరిన హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను జట్టులో చేర్చలేదు. ఎమ్మేస్కె ప్రసాద్ ధోని గురించి మాట్లాడుతూ,ఈ టోర్నమెంట్‌కు ధోని అందుబాటులో లేడు, అందువల్ల వారు రిషబ్ పంత్‌ను ఎంపిక చేసి అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి, ప్రధాన వికెట్ కీపర్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ధోని రిటైర్మెంట్ పుకార్ల గురించి అడిగినప్పుడు, ప్రసాద్ మాట్లాడుతూ రిటైర్మెంట్ పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం, ధోని వంటి దిగ్గజ క్రికెటర్ కి ఎప్పుడు రిటైర్ అవ్వాలో అతనికి తెలుసని చెప్పారు.

టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కె.ఎల్. రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ మరియు నవదీప్ సైని.

వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కె.ఎల్. రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ మరియు నవదీప్ సైని.

టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్),అజింక్య రహానె(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కె.ఎల్. రాహుల్, సి.పుజారా, హనుమా విహారీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here