బిగ్ బాస్-3 ఆట ఆరంభం

Big Boss 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu Launch Episode Highlights, Bigg Boss Telugu 3 Launch Highlights, Bigg Boss Telugu First Episode Highlights, First Episode of Big Boss 3 Telugu, Highlights Of Bigg Boss Telugu 3 Launch, Host Nagarjuna Akkineni Bigg Boss Telugu 3 Launch Updates, Mango News

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ ఆదివారం నాడు ప్రారంభమైంది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాతలుగా చేయగా, ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. సీజన్ 3 ప్రారంభ ఎపిసోడ్లో నాగార్జున ఒక్కో సభ్యున్ని ఆహ్వానించి, బిగ్ బాస్ ఇంటిలోకి పంపారు.

ప్రారంభ ఎపిసోడ్ హైలైట్స్:

 • కింగ్ సినిమాలో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున
 • గత రెండు సీజన్లకి వ్యాఖ్యాతగా వ్యవరించిన జూ.ఎన్టీఆర్,నాని లకు థాంక్స్ చెప్పిన నాగార్జున
 • ఇంటిలోకి వచ్చే సభ్యులను మీరే సెలెక్ట్ చేయాలనీ వ్యాఖ్యాత నాగార్జునని ఆదేశించిన బిగ్ బాస్
 • మొదటిగా మూడు చిట్టీలు తీసి వారిని బిగ్ బాస్ లోకి ఆహ్వానించిన నాగార్జున
 • మొదటగా ట్రంకు పెట్టెతో తీన్మార్ సావిత్రి ఎంట్రీ
 • రెండో సభ్యునిగా టివి నటుడు రవికృష్ణ ఇంటిలోకి ఎంటరయ్యాడు
 • మూడో చిట్టీ ద్వారా డబ్ స్మాష్ స్టార్ అషు రెడ్డి ఎంట్రీ
 • నాలుగో సభ్యుడిగా టీవీ9 జర్నలిస్ట్ జాఫర్ ఎంట్రీ, సరదాగా ప్రశ్నలు అడిగిన నాగార్జున
 • ఐదో సెలబ్రిటీగా హిమజ మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది, నాగార్జునని చూసిన ఆనందంలో, అడిగి మరి ఓసారి తన చేతిని టచ్ చేయించుకుంది
 • ఎంటరవుతున్న ప్రతి ఫిమేల్ సెలెబ్రిటీ నాగార్జునకి హాగ్ ఇవ్వడం విశేషం
 • ఆరో సెలబ్రిటీగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంట్రీ, పాటలు పాడి ఆకట్టుకున్నాడు
 • ఏడో సెలబ్రిటీగా టివి నటి రోహిణి ఎంట్రీ, నాగార్జునలా మిమిక్రి చేసింది
 • ఎనిమిది, తొమ్మిది సభ్యులుగా బాబా భాస్కర్, పునర్నవి భూపాలం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు
 • పదో సెలబ్రిటీగా హేమ ఎంట్రీ, వంట వచ్చా అని నాగార్జున అడగగా, చింపేస్తా అని సమాధానం ఇచ్చిన హేమ
 • పదకొండో సభ్యుడిగా అలీరేజా సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తూ ఎంట్రీ
 • పన్నెండో సభ్యుడిగా కమెడియన్ మహేష్ విట్టా ఎంట్రీ
 • పదమూడో సెలబ్రిటీగా యాంకర్ శ్రీముఖి, సూపర్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ
 • చివరిగా పద్నాలుగు, పదిహేనవ సభ్యులుగా దంపతులు అయిన వరుణ్ సందేశ్,వితికాల ఎంట్రీ, నాగార్జున అడగడంతో వితికాను ఎత్తుకొని బిగ్ బాస్ లోకి వెళ్లిన వరుణ్ సందేశ్
 • మొదటి ఎపిసోడ్ ఆసాంతం నాగార్జున తన మాటలతో వ్యాఖ్యాతగా అలరించాడు, ఇక ఇంటిలోకి ఎంటరయినా తోలి రోజే బిగ్ బాస్ రాహుల్, శ్రీముఖి, వితికా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ను నామినేట్ చేసినట్టు ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 3 కూడ,గత రెండు సీజన్ల తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =