తెలంగాణాలో ఆసరా పింఛన్ల పంపీణీ

Aasara pension scheme by the Government, Aasara Pensions By KCR, Aasara Pensions by KCR In Telangana, Aasara Pensions Distribution Begins In Telangana, Aasara Pensions latest News, Aasara Pensions Starts in Telangana state, Enhanced Aasara pension distribution began in Telangana, Mango News, Telangana Political News

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం జరిగింది, ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ, అన్ని రకాల పింఛన్ల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అర్హులైన ప్రజలందరికి పంపిణీ చేస్తున్నారు. అన్ని రకాల పింఛన్ లను తెలంగాణ ప్రభుత్వం రెట్టింపు చేసింది, పెంచిన పింఛన్లు జూన్ నెల నుండి అందజేయాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా పింఛన్ అందజేస్తున్నారు.

సిరిసిల్ల లో జరిగిన ఆసరా పింఛన్ల కార్యక్రమం లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత పింఛన్లు ఐదు రేట్లు పెంచుకున్నామని తెలిపారు. పింఛన్ వయసు తగ్గింపు జూన్ నెల నుంచే వర్తింపజేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా 2 లక్షలమంది బీడీ కార్మికులకు పింఛన్ వస్తుందని చెప్పారు.

సిద్దిపేట్ లో ఆసరా పింఛన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల కష్టాలు తెలిసిన మనిషి అని, పేద ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. మరో వైపు హైదరాబాద్ లో రవీంద్రభారతీలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్, మహమద్ అలీ లు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఇతర అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు.

 

[subscribe]
[youtube_video videoid=dFhIQqI89PM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =