రెండో వ‌న్డేలో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం, సిరీస్‌ కైవసం

Ind vs NZ 2nd ODI Team India Win by 8 Wickets and Clinch The Series 2-0,Second ODI, India Vs Newzealand ODI,India Vs Newzealand,Must Win To Stay In Series,Mango News,Mango News Telugu,Nz Vs Ind,India Cricket Team,Newzealand Cricket Team,Indian Team Captain Hardik Pandya,Hardik Pandya,Newzealand Team Captain Kane Williamson,Kane Williamson,Ind Vs Nz Latest News And Updates,Indian Cricket Latest News And Updates,Kane Williamson News and Updates,Hardik Pandya News and Live Updates,

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రాయపూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత భారత బౌలర్లు, తర్వాత బ్యాటర్లు చెలరేగి ఆడటంతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. బౌలింగ్‌లో మహ్మద్ ష‌మీ (3 వికెట్లు), హార్దిక్ పాండ్యా (2 వికెట్లు) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అర్ధ సెంచరీ (51 పరుగులు) చేయగా.. మరో ఓపెనర్ శుభమన్ గిల్ (40 పరుగులు) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. శాంట్నర్ 27 పరుగులు చేశాడు. ఇక గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన బ్రేస్‌వెల్ 22 పరుగులకే పెవిలియన్ చేరాడు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టులోని ఆటగాళ్లు 8 మంది సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోవడం విశేషం. ముఖ్యంగా ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ షమీ 6 ఓవ‌ర్ల‌లో 18 ప‌రుగులిచ్చి 3 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక సిరీస్‌లో చివరి వన్డే ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here