రాత్రి 8 నుంచే ఐపీఎల్ మ్యాచులు, తొలిసారిగా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌

BCCI President Sourav Ganguly, IPL matches Timings, Final Venue,IPL matches New Rules,Mango News Telugu,IPL 2020 Match Dates,BCCI President Sourav Ganguly Announced New Rules,IPL 2020 schedule,Latest Sports News 2020,IPL Match Schedule 2020

జనవరి 27, సోమవారం నాడు ముంబయిలో ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)- 2020 నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్‌ టోర్నీలో ఇంతకుముందు లాగానే రాత్రి 8 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి ఐపీఎల్‌ రాత్రి మ్యాచులను 7 గంటలకు మారుస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై పాలక మండలిలో చర్చించిన అనంతరం సమయం మార్పులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే రెండు మ్యాచులు జరిగే రోజుల్ని తగ్గించామని, కేవలం ఐదు రోజుల్లో మాత్రమే సాయంత్రం 4 గంటలుకు , రాత్రి 8 గంటలుకు రెండు మ్యాచులు నిర్వహించనున్నామని తెలిపారు.

ఐపీఎల్‌-2020లో తొలిసారిగా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను ప్రవేశ పెడుతున్నామని గంగూలీ తెలిపారు. ఇక ఈ టోర్నీలో నోబాల్‌ నిర్ణయాలను మూడో అంపైర్‌ తీసుకుంటారని ఆయన వెల్లడించారు. అలాగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మే 24, ఆదివారం నాడు ముంబయిలో జరుగుతుందని అన్నారు. ఐపీఎల్‌-2020 ప్రారంభానికి మూడు రోజుల ముందు ఐపీఎల్‌ ఆల్‌ స్టార్స్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నామని, మ్యాచ్‌ నిర్వహణకు వేదికను ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం జరిగే ఈ ఛారిటీ మ్యాచ్ యొక్క ప్రక్రియను సరైన వారికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుతో మార్చి నెలలో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌ కోసం, కొత్త సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని గంగూలీ ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =