24 సంవత్సరాల తర్వాత.. కామన్‌వెల్త్ గేమ్స్‌లోకి క్రికెట్

2022 Commonwealth Games, Commonwealth Games 2022, commonwealth games 2022 cricket qualifier, commonwealth games 2022 cricket schedule, commonwealth games 2022 cricket teams, Cricket at the 2022 Commonwealth Games, cricket in commonwealth games, Cricket in CWG after 24 years, Cricket Makes Return To Commonwealth Games, Cricket Makes Return To Commonwealth Games 2022, Cricket Makes Return To Commonwealth Games 2022 After 24 Years Long Time, Final list for cricket at Birmingham 2022, Mango News

24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వచ్చింది. 2022 లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ క్రీడకు మళ్ళీ చోటు లభించింది. సుదీర్ఘ కాలం తర్వాత క్రికెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం మహిళా జట్లే పాల్గొంటున్నాయి. కామెన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్ అరంగేట్రం చారిత్రక క్షణమని ఐసీసీ తన స్పందన తెలియజేసింది.
లీగ్ కమ్ నాకౌట్ విమెన్స్ టోర్నమెంట్‌‌లో తొలి మ్యాచ్.. 2020 విమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జులై 29న జరుగనుంది. కాంస్య మరియు బంగారు పతక మ్యాచ్‌లు ఆగస్టు 7న షెడ్యూల్ చేయబడతాయి.

మహిళల T-20 టోర్నమెంట్‌లో ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బార్బడోస్ జట్లు అర్హత సాధించగా.. శ్రీలంక ఎనిమిదో జట్టుగా అర్హత సాధించింది. కామన్‌వెల్త్ గేమ్స్‌కు శ్రీలంక జట్టు అర్హత సాధించినందుకు ఐసీసీ, సీడీఎప్, కామన్‌వెల్త్ గేమ్స్ అభినందనలు తెలిపాయి. కాగా, మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో బార్బడోస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఉండగా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి.

1998లో కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో పురుషుల జట్టు ఆడిన తర్వాత మళ్ళీ క్రికెట్‌కు చోటు కల్పించడం ఇది రెండోసారి మాత్రమే అవుతుంది. షాన్ పొలాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా.. స్టీవ్ వా సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టును ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణం సాధించింది. ICC హాల్ ఆఫ్ ఫేమర్స్.. భారతదేశానికి చెందిన సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్ మరియు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే 1998 గేమ్స్‌లో పాల్గొన్నారు. అయితే, ఈ యేడాది జులై 28 నుంచి మొదలు కానున్న కామన్‌వెల్త్ గేమ్స్‌ ఆగష్టు 8 వరకు జరుగనున్నాయి. మొత్తం 72 దేశాలకు చెందిన 4,500 అథ్లెట్స్ పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =