IPL కొత్త టీమ్ ‘అహ్మదాబాద్’ సారథిగా.. హార్దిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో.. ఈసారి కొత్తగా ఎంటర్ అవుతున్న టీమ్స్ అహ్మదాబాద్, లక్నో. అయితే, మెగా వేలానికి ముందు ఒక్కొక్క టీం ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ ఈ ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. తాజాగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. తాను రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. అహ్మదాబాద్‌ జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా.. రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్‌లను కూడా కొనుగోలు చేసింది. CVC క్యాపిటల్స్ యాజమాన్యంలోని అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. రూ. 15 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి హార్దిక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఒక్క హార్దిక్ పాండ్యా కోసం మాత్రమే కాదు.. అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఇంకా స్వదేశీ యువ ఆటగాడు శుభమాన్ గిల్ కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్.. లెగ్ స్పిన్నర్ రషీద్‌ను కూడా అహ్మదాబాద్ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో, గత సీజన్ వరకు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగమైన భారత యువ బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్ కోసం ఫ్రాంచైజీ రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. ఈ ముగ్గురి కొనుగోలు తర్వాత.. మిగతా ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ. 52 కోట్లుకు అవకాశం ఉండనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + twenty =