సంక్రాంతికి ఈ నెల 11 నుంచి 14 వరకు టీఎస్ఆర్టీసీలో 1.21 కోట్ల మంది ప్రయాణం: ఎండీ వీసీ సజ్జనార్‌

1.2 Cr Passengers Travelled in TSRTC Buses During Sankranthi Festival MD VC Sajjanar,1.2 Cr Passengers Travelled,TSRTC Buses,During Sankranthi Festival,MD VC Sajjanar,Mango News,Mango News Telugu,Sankranthi Festival,Telangana Sankranthi Festival,VC Sajjanar,TSRTC Latest News and Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపింది. సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించారు. ఆ వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “సంక్రాంతికి ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు టీఎస్ఆర్టీసీ చేర్చింది. గత సంక్రాంతితో పోల్చితే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా ప్రయాణించారు. 4 రోజుల్లో 1.57 కోట్ల కి.మీ మేర బస్సులు తిరిగాయి. ప్రజలను క్షేమంగా సొంతూళ్లకు చేర్చిన సిబ్బందికి అభినందనలు” అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రజలందరికీ వీసీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సంక్రాంతి పండుగ అనంతరం ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే ప్రజల కోసం జనవరి 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడపుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =