రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, నేడే హైద‌రాబాద్‌ చేరుకోనున్న మూడు రాష్ట్రాల సీఎంలు

BRS Party First Public Meeting Tomorrow at Khammam CM's KCR Kejriwal pinarayi Vijayan Bhagwant Mann will Attend,BRS Party First Public Meeting, Tomorrow at Khammam, CM's KCR, Kejriwal, pinarayi Vijayan, Bhagwant Mann will Attend,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఖమ్మంలో రేపు (జనవరి 18, బుధవారం) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభను భారీస్థాయిలో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ నేతలు ఖమ్మంలో సభకు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం పట్టణం, పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే గులాబీమయంగా మారాయి. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ తో పాటుగా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలు జాతీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

కాగా ఈ జాతీయ నేతలందరూ ఈ రోజు రాత్రికే (జనవరి 17, మంగళవారం) హైదరాబాద్‌ కు చేరుకోనున్నారు. హైదరాబాద్ కు చేరుకునే సందర్భంగా సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, ఇతర నేతలకు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వాగతం పలుకనున్నారు. బుధవారం ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ తో బ్రేక్‌ఫాస్ట్‌ చేయనున్నారు. అనంతరం వారంతా తాజా దేశ రాజకీయ పరిస్థితులు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రికి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత వారంతా యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మం చేరుకున్నాక ముగ్గురు సీఎంలు, సీఎం కేసీఆర్‌ తో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌ కు చేరుకొని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =