రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమం

CM KCR Orders Release of Rs 19000 Cr For Crop Loan Waiver To Farmers Ahead of Assembly Polls,CM KCR Orders Release of Rs 19000 Cr,Release of Rs 19000 Cr For Crop Loan Waiver,Crop Loan Waiver To Farmers,CM KCR good news for farmers, CM KCR , good news for farmers, telangana farmers, farmer loan waiver,Loan Waiver To Farmers Ahead of Assembly Polls,Mango News,Mango News Telugu,As Telangana poll looms,KCR clears 2018 farm loan waiver,Telangana govt to resume farmer loan,CM KCR orders resumption and completion,Rs 1L crop loan waiver from today,KCR decides to complete farm loan,Telangana CM KCR orders release,CM KCR Latest News,CM KCR Latest Updates

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు అపోజిషన్ పార్టీల ఊహాగానాలకు చెక్ పెడుతూ.. రైతన్నలకు బుధవారం పెద్ద శుభవార్తనే వినిపించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో రుణమాఫీ అసాధ్యం అంటూ వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి అంటే ఆగస్ట్ 3 నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావును, అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమంతో పాటు.. వ్యవసాయాభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి చెబుతూ రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల హామీలు తలకు మించిన భారంగా ఉండటంతో.. రుణ మాఫీ ఊసెత్తరేమో అనుకున్న ప్రతిపక్షాలకు పెద్ద షాకే ఇచ్చారు కేసీఆర్. ఇటు లోటు బడ్జెట్‌తో కొన్నిహామీల ఊసెత్తకపోవడం మంచిదేన్న విశ్లేషకుల మాటను కూడా పక్కన పెట్టి కేసీఆర్ సంచలన నిర్ణయమే తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే ఏది ఏమయినా ఈ ఎన్నికలలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న సీఎం కేసీఆర్ గట్టి నిర్ణయం ముందు ఇవన్నీ చాలా చిన్న నిర్ణయాలేనని కేసీఆర్ గురించి బాగా తెలిసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే గతంలో సీఎం ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చలేదని పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతోన్న ఈ సమయంలో.. ఎవరూ ఏ మాత్రం ఊహించని విధంగా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఈ హామీలను నెరవేర్చకపోవడం వెనుక కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో ఏర్పడిన మందగమనం..కరోనా వల్ల కలిగిన ఆర్థిక సమస్యలు అడ్డుపడ్డాయని వివరించారు.అలాగే ఎఫ్ఆర్బీఎం నిధులను రిలీజ్ చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు వంటి కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైందని సీఎం సంజాయిషీ ఇచ్చుకున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం..రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఆపకుండా కొనసాగిస్తూనే వస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. తాము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. ఆరు నూరయినా రైతుల సంక్షేమాన్ని.. వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను మరచిపోయే ప్రసక్తే లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోనూ మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. రైతుబంధు తరహాలోలాగే విడతల వారీగా కొనసాగిస్తూ.. నెల, పదిహేను రోజుల్లో అంటే సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =