కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణలో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం

Centre Gives Approval For The Procurement of 8 Lakh Tonnes of Rice From Telangana, Procurement of 8 Lakh Tonnes of Rice From Telangana, 8L tonnes of parboiled rice, Centre approved procurement From Telangana, parboiled rice, Centre Govt, 8 Lakh Tonnes of Rice, Telangana Rice Procurement, Telangana Rice Procurement News, Telangana Rice Procurement Latest News, Telangana Rice Procurement Latest Updates, Telangana Rice Procurement Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన ధాన్యం నుంచి దాదాపు 8లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొంది. కాగా గతంలో ఇచ్చిన 6.05 లక్షల మెట్రిక్ టన్నులకు అదనంగా పెద్ద మొత్తంలో బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొంది. దీనికి అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు కేంద్రం నుంచి దానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపింది. ఇక ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ ‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పీయూష్ గోయల్‌కు కిషన్ ‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here