వైఎస్ఆర్ తెలంగాణ వ్యతిరేకి కాదు, చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తా: వైఎస్ షర్మిల

Lotuspond Party Office, Mango News, Y.S. Sharmila to hold meeting with YSR loyalists, YS Sharmila, YS Sharmila Held Press Meet at Lotuspond Party Office, YS Sharmila Latest News, YS Sharmila Press Meet, YS Sharmila Press Meet at Lotuspond Party Office, YSRTP, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Held Press Meet, YSRTP Chief YS Sharmila Held Press Meet at Lotuspond Party Office, YSRTP Latest News, YSRTP Lotuspond Party Office

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల శుక్రవారం నాడు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఏర్పాటు ప్రకటన అనంతరం తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించిన ఆమె అనేక అంశాలపై మాట్లాడారు. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని, ప్రజలకోసం అన్ని అంశాలపై పోరాడామని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణకు వ్యతిరేకి కాదని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలి. విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా పెట్టేలా చేశారని, తెలంగాణ ప్రజలను వైఎస్ఆర్ గుండెల్లో పెట్టుకుని చూశారని షర్మిల అన్నారు.

చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఉద్యమంలో పాల్గొనని వారికి తెలంగాణ అంటే ఇష్టం లేదని కాదని అన్నారు. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదు. ఇది నా గడ్డ, దీనికి మేలు చేయడానికి వచ్చానన్నారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై అలిగి నేను పార్టీ పెట్టానని చెప్పడం సరికాదు. పుట్టింటి మీద అలిగితే ఎవరూ పార్టీలు పెట్టరని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామని, ఈ పార్టీని అవమానిస్తే వైఎస్ఆర్ ను అవమానించినట్లని అన్నారు. మరోవైపు కృష్ణ, గోదావరి బోర్డుల మీటింగ్ లను సీఎం కేసీఆర్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని, అందుకే కేంద్రం కృష్ణా,గోదావరి బోర్డులపై గెజిట్ విడుదల చేసిందన్నారు. కేంద్రం గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందిస్తాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, అలా చేస్తారని భావిస్తున్నాని పేర్కొన్నారు. ఏ రివర్ అయినా, ఒక్క చుక్క నీటి బొట్టును తెలంగాణ వదులుకోదు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క నీటి చుక్కను తీసుకోమని చెప్పారు. మరోవైపు ఏపీలో రాజన్నరాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేలా 3.85 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీచేయడం లేదని, అలాగే వైఎస్‌ఆర్ లాగే తానూ కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =