57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి, సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR Ordered Officials To Start Process For Old age Pension, CM KCR Ordered Officials To Start Process For Old age Pension for People Above 57 years, KCR announces old-age pension for those above 57 years, Mango News, Old age Pension for People Above 57 years, Old-age pensions for people aged above 57 yrs, Process For Old age Pension, Process For Old age Pension for People Above 57 years, Telangana CM KCR’s promise of Aasara age relaxation, Telangana Old Age Pension, Telangana Old Age Pension Scheme

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. అలాగే దోభీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ పర్యవేక్షించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =