హైదరాబాద్ లో 960 బృందాలతో 52,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించాం: సీఎస్

Somesh Kumar, Special Sanitation Drive, Special Sanitation Drive In Hyderabad, telangana, Telangana CS, Telangana CS Meeting, Telangana CS Meeting On Special Sanitation Drive, Telangana CS Somesh Kumar Meeting, Telangana News, Telangana Special Sanitation Drive

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పని తీరు, మిగిలిపోయిన వరద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయ పంపిణీపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, వరదల అనంతరం హైదరాబాద్ లో సుమారు 52,000 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని, 960 బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వ్యర్థాలను తొలగించామని అన్నారు. ఈ డ్రైవ్ లో భాగంగా నిర్మాణ వ్యర్థాల తొలగింపు మరియు వరద ప్రాంతాలలో డిస్ ఇన్ ఫెక్టెంట్ లను చల్లడం లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =