తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ

Consulate General of US Joel Reifman, Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Political Live Updates, Telangana Political Updates
అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్ జనవరి 16, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల విషయాలపై కీలకంగా చర్చించారు. అలాగే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణం కావాల్సి ఉన్న అమెరికా వీసా కార్యాలయం విషయంపై కూడా జోయెల్ రీఫ్‌మెన్, సీఎస్‌ సోమేష్‌కుమార్‌ చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. సోమేష్‌కుమార్ జనవరి 1, 2020న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే జోయెల్ రీఫ్‌మెన్ కూడా ఇటీవలే అమెరికా కాన్సులేట్ జనరల్‌గా హైదరాబాద్ లో నియమితులవ్వడంతో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =