మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, BCCI Central Contracts List, board of control for cricket in india, latest sports news, latest sports news 2020, Mango News Telugu, MS Dhoni Dropped From BCCI, sports news

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు ఈ కాంట్రాక్టులు అమల్లో ఉంటాయి. గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్‌ బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్‌ సి ఆటగాళ్లకు రూ.1 కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. అయితే తాజాగా బీసీసీఐ ప్రకటించిన సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరు గల్లంతైంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ గత ఏడాది ధోనికి ఏ గ్రేడ్‌ కాంట్రాక్టు కేటాయించిన బీసీసీఐ, ఈసారి మాత్రం మొండి చెయ్యి చూపించింది. బీసీసీఐ కాంట్రాక్టు కేటాయించకపోవడంతో మహేంద్రసింగ్‌ ధోని కెరీర్‌ పై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. మరో వైపు ఇప్పటివరకు గ్రేడ్‌-బిలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ గ్రేడ్‌ ఏ లో చోటు సంపాదించాడు.

బీసీసీఐ 2019-20 కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల జాబితా :

గ్రేడ్‌ ఏ ప్లస్‌ :

విరాట్‌ కోహ్లి
రోహిత్‌ శర్మ
జశ్‌ప్రీత్‌ బుమ్రా

గ్రేడ్‌ ఏ :

రవిచంద్రన్ అశ్విన్‌
రవీంద్ర జడేజా
భువనేశ్వర్‌ కుమార్‌
చటేశ్వర్‌ పుజారా
అజింక్య రహానె
శిఖర్‌ ధావన్‌
మహ్మద్‌ షమి
ఇషాంత్‌ శర్మ
కుల్దీప్‌ యాదవ్‌
రిషబ్‌ పంత్‌
కెఎల్‌ రాహుల్‌

గ్రేడ్‌ బి :

ఉమేశ్‌ యాదవ్‌
యజ్వేంద్ర చాహల్‌
హార్దిక్‌ పాండ్య
వృద్దిమాన్‌ సాహా
మయాంక్‌ అగర్వాల్‌

గ్రేడ్‌ సి :

కేదార్‌ జాదవ్‌
మనీశ్‌ పాండే
హనుమ విహారి
నవదీప్‌ సైని
దీపక్‌ చాహర్‌
శార్దుల్‌ ఠాకూర్‌
శ్రేయాష్‌ అయ్యర్‌
వాషింగ్టన్‌ సుందర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =