రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్: మంత్రి జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddy Inspected Works of Gas Insulated Substation at Hyderabad

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ అని పేర్కొన్నారు. బుధవారం ట్రాన్స్ కో అండ్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాయదుర్గంలోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలు కూడా నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని, దీంతో ఒక్క క్షణం కూడా కరెంట్ పోదని అన్నారు. రింగ్ రోడ్ చుట్టూ 400 కేవీ సబ్ స్టేషన్ లు, 220 కేవీ,133 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశామని, నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయుడం దీని ప్రత్యేకత అని అన్నారు. ఈ నాలుగు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం కానీ ప్రత్యేకంగా 5 ఎకరాల స్థలంలోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశామని, దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా తెలంగాణలోనే వాడుతున్నామని తెలిపారు. టీఎస్ ట్రాన్స్ కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందని, పనులు చాలా వేగంగా జరిగాయన్నారు. కోవిడ్ తోపాటు అనేక ఆటంకాలు తట్టుకొని పూర్తి చేశాం. ఈ సబ్ స్టేషన్ తో నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చని చెప్పారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను 1400 కోట్ల నిర్మాణం చేశామని, త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =