ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శైలజానాథ్‌ నియామకం

Andhra Pradesh Latest News, Andhra Pradesh PCC Chief, AP Breaking News, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, Mango News Telugu, Sailajanath Appointed As Andhra Pradesh PCC Chief
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనవరి 16, గురువారం నాడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సీనియర్ నాయకులు తులసిరెడ్డి, షేక్‌ మస్తాన్‌వలీని నియమించారు. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జారీ చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడంతో అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. అంతేగాక గత కొన్ని నెలల నుంచి పార్టీ వ్యవహారాలకు, సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం శైలజానాథ్‌ను అధ్యక్షుడిగా నియమించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =