వరదసాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ, మీసేవా కేంద్రాలకు వెళ్లోద్దని సూచన

GHMC Commissioner Lokesh Kumar About Flood Relief Distribution In The City,GHMC Commissioner Lokesh Kumar Asks Flood Victims Not To Visit Mee-Seva Centres,Flood Relief Money,GHMC,GHMC Commissioner,GHMC Commissioner Latest News,Lokesh Kumar,GHMC Commissioner Lokesh Kumar,GHMC Commissioner Lokesh Kumar News,Mango News,Mango News Telugu,Flood Relief Distribution,Hyderabad,GHMC Commissioner Lokesh Kumar About Flood Relief Distribution,Hyderabad Floods,Hyderabad Rains,GHMC Commissioner Lokesh Kumar About Flood Relief Money

హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అర్హులైన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ డిసెంబర్ 7, సోమవారం నుంచి మళ్ళీ వరదసాయం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ వరద సాయం కోసం ఇంతకుముందులా బాధితులు మీ-సేవా సెంటర్లుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సోమవారం నాడు జీహెచ్ఎంసీ‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వం అందించే సాయాన్ని నేరుగా బాధితుల యొక్క బ్యాంకు ఖాతాల్లోనే జమచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం పొందని వారి వివరాలను సేకరిస్తున్నాయని చెప్పారు. అర్హులైన బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని ఆ తర్వాత వారి ఖాతాల్లోనే నేరుగా వరద సాయం రూ.10 వేలు జమ అవుతాయని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6.64 లక్షల కుటుంబాలకు వరదసాయం కింద రూ.664 కోట్లు అందజేసినట్లు వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =