ఎపిసోడ్ 14 (ఆగస్టు 3), ఎపిసోడ్ 15 (ఆగస్టు 4) హైలైట్స్: జాఫర్ ఎలిమినేషన్, కన్నీరుపెట్టిన శ్రీముఖి

Bigg Boss Season 3 Telugu Weekend Episodes Highlights,Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 14,Bigg Boss Episode 15 Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 15 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 15, himaja, Jaffar, Mango News Telugu, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri, Varun Sandesh, Vithika,Jaffar Elmination

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు.ఆగస్టు 3, 4న ప్రసారమైన బిగ్ బాస్ 3 పద్నాలుగు ,పదిహేనువ ఎపిసోడ్స్ లో ఇంటి సభ్యులతో కలిసి నాగార్జున అలరించారు, ఇంటిలో జరుగుతున్న గొడవలపై స్పందించారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు. జాఫర్ ఎలిమినేషన్ తో ఇంటిలో 14 మంది సభ్యులున్నారు.

ఎపిసోడ్ 14 (ఆగస్టు 3), ఎపిసోడ్ 15 (ఆగస్టు 4) హైలైట్స్: జాఫర్ ఎలిమినేషన్, కన్నీరుపెట్టిన శ్రీముఖి, బాబా భాస్కర్

శనివారం(ఆగస్టు 3) ఎపిసోడ్:

 • గ్రీకు వీరుడు, నా రాకుమారుడు సాంగ్ తో నాగార్జున ఎంట్రీ
 • నాలుగున్నర కోట్లమంది తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ షో ని చూస్తున్నారని నాగార్జున చెప్పారు
 • మన టీవీ ద్వారా ఇంటి సభ్యులు చేసే పనులు చూపించారు
 • తమన్నా సింహాద్రి రవికృష్ణ పేస్ వాష్ దాచేసింది, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై మాట్లాడుకున్నారు
 • అందరికంటే వరుణ్ సందేశ్-వితికాలతో ఇబ్బందిగా ఉందని శ్రీముఖి,జాఫర్ మాట్లాడుకున్నారు
 • నాగార్జున ఇంటి సభ్యులకు హెచ్చరికలు జారీచేశారు, తమన్నా సింహాద్రి అలీరేజా పై చేసిన విమర్శలు, మహేష్- వరుణ్ సందేశ్ గొడవ, శివజ్యోతి ప్రతిసారి ఏడవడంపై మాట్లాడాడు
 • ఇంటిలో హీరోలుగా భావించేవారికి గోల్డ్ కీరిటం, విలన్ లా భావించేవారికి బ్లాక్ కీరిటం పెట్టమని నాగార్జున సభ్యులకు సూచించారు
 • బాబా భాస్కర్ కి వరుసగా హీరోగా మూడుకిరీటాలు వచ్చాయి, విలన్ గా వరుణ్ సందేశ్, తమన్నాకి ఎక్కువ కిరీటాలు వచ్చాయి
 • ఎలిమినేషన్ లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఈ ఎపిసోడ్లో నాగార్జున ప్రకటించారు. మహేష్, హిమజ, రాహుల్,శ్రీముఖి సేఫ్ అవ్వగా మిగిలిన నలుగురు సభ్యులు ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ ఆదివారం ఎపిసోడ్ కు పొడిగించారు

ఆదివారం(ఆగస్టు 4) ఎపిసోడ్:

 • మనం సినిమాలో సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు
 • ఇంటి సభ్యులందరికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసారు
 • ఒక బౌల్ లో ఉన్న ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ తీసుకుని మిగతా ఇంటి సభ్యులలో ఎవరోఒకరికి కట్టాలని నాగార్జున అందరిని కోరారు
 • పునర్నవి భూపాలంను సేఫ్ జోన్లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు
 • ఇస్మార్ట్ శంకర్ టీం బిగ్ బాస్ కార్యక్రమం లో సందడి చేసింది
 • మొదటగా హీరో రామ్ ని ఆహ్వానించినా నాగార్జున, తరువాత హీరోయిన్ నిధి అగర్వాల్ ను స్వాగతం చెప్పారు
 • వారితో కలిసి ఒక పాటకు ఇంటి సభ్యులతో సహా అందరూ డాన్స్ వేసారు
 • ఒక్కో ఇంటి సభ్యుడికి ఒక సినిమా పేరున్న బ్యాడ్జ్ ఇచ్చి, ఇది ఎవరికీ సరిపోతుందో చెప్పాలని కోరగా, సినిమా పేర్లకు తగ్గట్టు ఇంటిలో సభ్యులకు బ్యాడ్జ్ తగిలించారు
 • తరువాత వరుణ్ సందేశ్ సేఫ్ అని హీరో రామ్ ప్రకటించారు
 • మిగిలిన జాఫర్, వితికాలలో ఎవరు ఉండాలని ఇంటి సభ్యులను కోరగా, జాఫర్ ఉండాలని ఏడుగురు కోరుకోగా, వితికా ఉండాలని అరుగు సభ్యులు కోరుకున్నారు
 • బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున ప్రకటించారు, జాఫర్ బిగ్ బాస్ ఇంటిలో సభ్యులను వదిలివెళ్లిపోవాల్సి రావడంతో ఏడ్చేశాడు, దీంతో శ్రీముఖి ఏడ్చేసింది, బాబా భాస్కర్ ఇతర సభ్యులు కూడ ఏడ్చేసారు
 • ఎలిమినేషన్ తరువాత స్టేజ్ పైకి వచ్చిన జాఫర్, ఇక్కడికి రాకముందు బిగ్ బాస్ స్క్రిప్ట్ అనుకున్నానని, రెండురోజుల తరువాత నిజం తెలిసిందని ఇంటి సభ్యులు అంత బాగా ఆడుతున్నారని చెప్పారు
 • ఇంటి సభ్యులతో స్టేజ్ పై నుండి ముఖాముఖీ నిర్వహించాడు
 • ఈ సంధర్భంగా ఇంటిలో రెండు గ్రూప్స్ ఉన్నాయని జాఫర్ చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here