హైద‌రాబాద్‌: విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌ఐ ఫిర్యాదు.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై కేసు నమోదు

Hyderabad Case Files Against Ex-Central Minister Renuka Chowdhury on SI Complains of Duty Obstruction, Hyderabad Case Files Against Ex-Central Minister Renuka Chowdhury, SI Complains of Duty Obstruction, Duty Obstruction, Case Files Against Ex-Central Minister Renuka Chowdhury, Ex-Central Minister Renuka Chowdhury, Former Central Minister Renuka Chowdhury, Central Minister Renuka Chowdhury, Minister Renuka Chowdhury, Renuka Chowdhury, Hyderabad Case Files, Police case against Ex-Central Minister Renuka Chowdhury, senior Congress leader Renuka Chowdhury, Hyderabad Case, Mango News, Mango News Telugu,

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌ఐ ఉపేంద్ర ఆమెపై చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధం ఉన్నదంటూ నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఈడీ సమన్లు ​​జారీ చేసి విచారిస్తున్నందుకు నిరసనగా హైదరాబాద్‌లో రాజ్ భవన్ ముట్టడికి టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో పాల్గొన్న సందర్భంగా రేణుకా చౌదరి విధి నిర్వహణలో ఉన్న ఒక ఎస్‌ఐ కాలర్ పట్టుకోవడంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పీఎస్ ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రేణుకా చౌదరి మరియు రేవంత్ రెడ్డి ఇద్దరిపై IPC సెక్షన్లు 151, 140, 147, 149, 341, 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) కింద అభియోగాలు మోపారు. అంతకుముందు హైదరాబాద్‌లో రేణుకా చౌదరి ఒక పోలీసు కాలర్‌ను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. నిరసన సమయంలో వెనుకనుంచి నెట్టివేయబడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయి పోలీసులపై పడిపోయానని, దీనికి తాను పోలీసుకు క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =