రుక్మాపూర్ సైనిక్ స్కూల్, బీబీనగర్ మహిళా సైనిక్ డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Released Entrance Results of Rukmapur Sainik School Bibinagar Sainik Degree College, Telangana Minister Koppula Eshwar Released Entrance Results of Rukmapur Sainik School Bibinagar Sainik Degree College, Koppula Eshwar Released Entrance Results of Rukmapur Sainik School Bibinagar Sainik Degree College, Minister Koppula Eshwar Released Entrance Results of Bibinagar Sainik Degree College, Minister Koppula Eshwar Released Entrance Results of Rukmapur Sainik School, Entrance Results of Rukmapur Sainik School Bibinagar Sainik Degree College, Entrance Results of Bibinagar Sainik Degree College, Entrance Results of Rukmapur Sainik School, Rukmapur Sainik School Bibinagar Sainik Degree College, Bibinagar Sainik Degree College, Rukmapur Sainik School, Telangana Minister Koppula Eshwar, Minister Koppula Eshwar, Bibinagar Sainik Degree College Entrance Results News, Bibinagar Sainik Degree College Entrance Results Latest News, Bibinagar Sainik Degree College Entrance Results Latest Updates, Bibinagar Sainik Degree College Entrance Results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర గురుకులాలు మొత్తం విద్యారంగంలో దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని, 5 సొసైటీలలో కలిపి మొత్తం 981 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు. వీటిలో సుమారు 6 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారని, అందరికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. రుక్మాపూర్ (కరీంనగర్ ) సైనిక్ స్కూల్, బీబీనగర్ మహిళా సైనిక్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం మార్చి 27న ప్రవేశ పరీక్ష నిర్వహించగా, వాటి ఫలితాలను గురువారం మంత్రి కొప్పుల విడుదల చేశారు.

హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఈ సైనిక్ స్కూల్, సైనిక్ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు చాలా బాగున్నాయని, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్నారని, వీరికి అత్యుత్తమ అవకాశాలు వస్తాయని, చక్కని భవిష్యత్తు ఉంటుందని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్ ప్రవేశ పరీక్షలు, ఫలితాల గురించి మంత్రికి వివరించారు. రుక్మాపూర్ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష 3,550 మంది రాయగా, ఫిజికల్, మెడికల్ టెస్టుల తర్వాత 78 మందికి ప్రవేశాలు లభించాయని నాయక్ తెలిపారు. సొసైటీలోని 30 మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఎంట్రన్స్ టెస్టుకు హాజరైన 25 వేల మందిలో 965 మంది బీబీనగర్ కాలేజీని కోరుకున్నారని, వీరిలో 126 మందికి మాత్రమే ప్రవేశాలు లభించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ లు విద్యార్థినీ, విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =