ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పిలుపు

Delhi Liquor Scam ED Summons MLC Kalvakuntla Kavitha Called her to Attend on March 9 for Questioning,Delhi Liquor Scam,ED notices to MLC Kavitha,Court summons to Kavitha,Mango News,Mango News Telugu,ED To Question KCR Daughter,KCR's Daughter K Kavitha,Delhi Liquor Policy Scam,Delhi Liquor Scam Case,ED Arrests,Delhi Liquor Scam ED Arrests,Delhi Liquor Scam Case Latest Updates,Delhi Liquor Scam Case latest News,Delhi Liquor Scam Case Updates,Delhi Liquor Scam Case Live Updates,

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 9, గురువారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం 2022, డిసెంబర్ 11న బంజారాహిల్స్‌ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వష్ట నేతృత్వంలోని అధికారుల బృందం కవిత నుంచి ఈ కేసుకు సంబంధించి వివరణ తీసుకుంది. ఆ సందర్భంగా దాదాపు ఏడు గంటల పాటు సీబీఐ బృందం పలు అంశాలపై కవితను ప్రశ్నించారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు ఈడీ కూడా నోటీసులు పంపింది. ముందుగా సోమవారం రాత్రి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోహైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆయనపై వేసిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం ఈడీ ఆమెకు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =