నేడు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్?

Jharkhand CM Hemant Soren Likely to Meet CM KCR at Pragathi Bhavan Today, CM Hemant Soren Likely to Meet CM KCR at Pragathi Bhavan Today, Jharkhand CM Hemant Soren Likely to Meet CM KCR at Pragathi Bhavan, Telangana CM KCR meets Jharkhand CM Hemant Soren, Jharkhand CM Hemant Soren meets CM KCR, Jharkhand CM Hemant Soren, CM Hemant Soren, Jharkhand CM, Hemant Soren, Pragathi Bhavan, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

జేఎంఎం పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ హైద‌రాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సీఎం హేమంత్ సోరెన్ భేటీ కానున్న‌ట్లు తెలుస్తుంది. ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజ‌కీయాలు, ప్రత్యామ్నాయ కూటమి, కేంద్రం విధానాలపై పోరు సహా పలు అంశాల‌పై ఇరువురు నేతలు చ‌ర్చించే అవకాశం ఉన్నట్టు స‌మాచారం. అలాగే సీఎం హేమంత్ సోరెన్ పలువురు ఇతర పార్టీల నేతలను కూడా కలిసే అవకాశం ఉంది.

ముందుగా గత మార్చిలో సీఎం కేసీఆర్ జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. రాంచీలో సీఎం కేసీఆర్ కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ ఘనంగా స్వాగతం పలికారు. సీఎం హేమంత్ సోరెన్‌ నివాసంలో ఇరువురూ సీఎంలు సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే సీఎం హేమంత్ సోరెన్‌ తో భేటీ ముగిసాక గతేడాది గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికీ చెరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తుతున్న తరుణంలో, సీఎం కేసీఆర్ తో హేమంత్ సోరెన్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =