బోనాల ఉత్సవాల్లో సేవలందించిన పలు శాఖల సిబ్బందిని సన్మానించిన మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి

Ministers Talasani Srinivas Indrakaran Reddy Participated in Bonalu Celebrations Felicitation Program, Minister Indrakaran Reddy Participated in Bonalu Celebrations Felicitation Program, Minister Talasani Srinivas Participated in Bonalu Celebrations Felicitation Program, Ministers Talasani Srinivas And Indrakaran Reddy, Bonalu Celebrations Felicitation Program, Telangana Bonalu Celebrations Felicitation Program, Minister Indrakaran Reddy, Minister Talasani Srinivas, Telangana Bonalu Celebrations, Telangana Bonalu 2022, 2022 Telangana Bonalu, Telangana Bonalu, Bonalu 2022, Telangana Bonalu Celebrations Felicitation Program News, Telangana Bonalu Celebrations Felicitation Program Latest News, Telangana Bonalu Celebrations Felicitation Program Latest Updates, Telangana Bonalu Celebrations Felicitation Program Live Updates, Mango News, Mango News Telugu,

జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో సేవలందించిన పలు శాఖల సిబ్బందిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శనివారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్‌లో మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా నిరంతరం సేవలందించిన వివిధ విభాగాల సిబ్బందికి శాలువాలు, మెమెంటోలను అందజేసి సన్మానించారు. వీరిలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెల్త్, పోలీసు, ట్రాఫిక్, ఫైర్ సిబ్బంది, దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్, స్కౌట్ గైడ్స్ తదితర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేసిన విస్తృత ఏర్పాట్లకు తోడు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేసిన కారణంగానే నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఎంతో ఘనంగా జరగడంతో పాటు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. తమ సేవలను గుర్తించి సన్మానించడం పట్ల పలువురు అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్ లు అమయ్, హరీష్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =