హుజురాబాద్ నేత కౌశిక్‌ రెడ్డి కీలక నిర్ణయం, నేడు టీఆర్ఎస్ లో చేరిక

Congress Leader Koushik Reddy, Congress Leader Koushik Reddy Resigns, Huzurabad bypoll, Huzurabad bypoll 2021, Huzurabad Congress Leader, Huzurabad Leader Koushik Reddy, Huzurabad Leader Koushik Reddy will Join in TRS Party, Huzurabad Leader Koushik Reddy will Join in TRS Party Tomorrow, Koushik Reddy, Koushik Reddy will Join in TRS Party, Mango News, P Kaushik Reddy Likely To Join TRS, Telangana Congress leader Kaushik Reddy To Join TRS, TPCC Former Secretary P Kaushik Reddy Likely To Join TRS

హుజురాబాద్ కాంగ్రెస్‌ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్‌ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జూలై 21, బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఎస్ఎస్ పార్టీలో చేరనున్నట్టు కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కౌశిక్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషితో రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని, స్వలాభం కోసమే ఆయన రాజీనామా చేశారని కౌశిక్‌ రెడ్డి విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =