హైదరాబాద్​లో రూ. 300 కోట్ల ష్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Lays Foundation For Schneider Electric Smart Factory Worth Rs 300 Cr in Hyderabad Today, Minister KTR Foundation For Schneider Electric Smart Factory, Schneider Electric Smart Factory, Schneider Electric Smart Factory Worth Rs 300 Cr in Hyderabad, Mango News, Mango News Telugu, Schneider Electric Smart Factory , Minister KTR Lays Foundation, Minister KTR Latest News And Updates, Minister KTR, KTR

ప్రముఖ ఫ్రెంచ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ మరియు ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ తెలంగాణలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ఒక స్మార్ట్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. మంత్రి కేటీఆర్‌ గురువారం హైదరాబాద్​ నగరంలోని జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఈ స్మార్ట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్, దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం సంతోషమని, అందుకు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్పగా దోహదపడుతుందని, ఆదాయ ఉత్పత్తితో పాటు ఉద్యోగ కల్పనను పెంచుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ లో శిక్షణనివ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ రోజు హైదరాబాద్​లో ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్​ని ఏర్పాటు చేయనున్నారని, అలాగే మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు నగరంలో తమ శాఖలను ఏర్పాటు చేసి కార్యకలాపాలను నిర్వహించాలని మంత్రి ఆకాంక్షించారు. రాబోయే యూనిట్ తెలంగాణలో కంపెనీకి రెండవ ఫ్యాక్టరీ అవుతుందని, ఒక సంవత్సరం లోపే ఇది ఉత్పత్తి ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 7 =