కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రేపే నామినేషన్

Congress Party Presidential Elections Senior Leader Digvijay Singh will Contest and Likely to File Nomination Tomorrow, Congress Party Presidential Elections, Digvijay Singh will Contest, Digvijay Singh Nomination Tomorrow, Mango News, Mango News Telugu, Former Congress President Sonia Gandhi, Shashi Tharoor , Sonia Gandhi, Shashi Tharoor Latest News And Updates, Sonia Gandhi News, Congress Presidential Election, Rahul Gandhi Bharat Jodo Yatra

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా దిగారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నుండి తన నామినేషన్ ఫారమ్‌ను తీసుకునేందుకు వచ్చానని, రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తాను నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని దిగ్విజయ సింగ్ చెప్పారు. పోటీలో ఉండాలనేది పూర్తిగా తన నిర్ణయమేనని, పార్టీలో ఎవరితోనూ సంప్రదించలేదని అన్నారు. ఓవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో, పార్టీ లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌, దిగ్విజయ సింగ్ మధ్యనే పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే పోటీ గురించి దిగ్విజయ సింగ్ ను ప్రశ్నించగా, ఈ విషయంపై నామినేషన్స్ ఉపసంహరణ తేదీ అయిన అక్టోబర్ 8 వరకు వేచి చూడాలని పేర్కొన్నారు.

మరోవైపు గురువారం మధ్యాహ్నం ఎంపీ శశి థరూర్‌ తో దిగ్విజయ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై శశి థరూర్‌ ట్వీట్ చేస్తూ, ఈ మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్ ను కలిశాను. మా పార్టీ అధ్యక్ష పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నాను. మాది ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదని, సహోద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ అని మేమిద్దరం అంగీకరించాము. మా ఇద్దరికీ కావాల్సింది ఎవరు గెలిచినా, కాంగ్రెస్ గెలవడం” అని పేర్కొన్నారు. కాగా శశి థరూర్‌, దిగ్విజయ సింగ్ ల మధ్యనే కీలక పోటీ ఉండనుందా?, లేదా వీరిలో కూడా ఎవరైనా తప్పుకుంటారా అనే విషయంపై అక్టోబర్ 8 నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక స్పష్టత రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =