తెలంగాణపై వివ‌క్ష చూపిస్తోన్న కేంద్ర స‌ర్కార్, విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి మొండిచేయి – మండిపడ్డ మంత్రి కేటీఆర్

Minister KTR Sweeps Kishan Reddy Over Central Govt Discrimination Against Telangana, KTR Sweeps Kishan Reddy Over Central Govt Discrimination Against Telangana, Minister KTR sweeps Kishan Reddy, Minister KTR Says The saga of Modi Jis discrimination against Telangana, Modi Jis discrimination against Telangana, Minister KTR hits out at Central Govt Discrimination Against Telangana, KTR Slams Central Govt Discrimination Against Telangana, union minister G Kishan Reddy, union minister, G Kishan Reddy, Central Govt Discrimination Against Telangana, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డికి చురకలంటించారు. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి గతంలో ట్వీట్ చేశారు. అయితే మంగళవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రధాని మోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో దీనిపై కిషన్ రెడ్డి ట్వీట్ చేసిన సదరు స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్ ట్యాగ్ చేశారు. “తెలంగాణపై మోదీ జీ యొక్క వివక్ష యొక్క కథ నిరంతరాయంగా కొనసాగుతుంది” అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐఐఎంలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఐటీలు, ఎన్‌ఐడీలు, నవోదయ, మెడికల్ కాలేజీలు.. వీటిలో ఏ ఒక్కటీ తెలంగాణకు కేటాయించలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇచ్చిన హామీని కూడా మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేసమయంలో కేంద్రం జాతీయ ఇన్స్‌టిట్యూట్లను ఇత‌ర రాష్ట్రాల‌కు మంజూరీ చేస్తోందని వెల్లడించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని తాము భావిస్తున్నామని మంత్రి కేటీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలపై బుధవారం నాడు ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =