దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్

Telangana And AP CMs Extend Dussehra Wishes,Mango News,Ap Cm Ys Jagan Dussehra Wishes,Telangana CM KCR Dussehra Wishes,Telangana CM extends Dussehra greetings,AP CM extends Dussehra greetings

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా- సీఎం కేసీఆర్               

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ మానవాళి కి ఓ సందేశం అని ముఖ్యమంత్రి అన్నారు.

తుది గెలుపు మంచినే వరిస్తుంది- సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామని తెలిపారు. చెడు ఎంత శక్తిమంతమైన కూడ చెడుపై తుది గెలుపు మంచినే వరిస్తుందనే అనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి తెలియజెప్పిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో ఉండేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

దసరా లాంటి సంతోషకరమైన పండుగ సందర్భంగా మన అందరికీ ఆ జగన్మాత ఆశీర్వాదం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దసరా అంటే ధర్మానిదే విజయం అన్నదానికి ప్రతీక. దుర్గామాత ప్రజలందరికీ సుఖసంతోషాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను, రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు – ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
దుర్గాదేవి తొమ్మిది రోజులపాటు రాక్షసులపై పోరాడి పదవ రోజున విజయం సాధించింది. చెడును నిర్మూలించి, విజయం సాధించేవరకు పోరాటం ఆపకూడదన్నది ఈ పండుగ సారాంశం. ఈ దసరా మీ లక్ష్యాలను నెరవేర్చి మీ ఇంటిల్లిపాదికీ శుభాలను పంచాలని కోరుకుంటూ తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు – టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో సకల సుఖాలు కలగాలని ఆశీస్తూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here