కొత్తగా ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ పురపాలక చట్టాల్లో సవరణలివే…

Telangana Assembly Approves Amendments of GHMC Telangana Municipal Acts Establishes Mulugu as Municipality, GHMC Telangana, Municipal Acts , Mulugu Municipality, Mango News, Mango News Telugu, GHMC, Telangana Assembly , Telangana Assembly Sessions, GHMC Telangana Municipal Acts , Telangana Assembly Approves GHMC Acts, Telangana Legislative Assembly, Telangana News And Live Updates

తెలంగాణ రాష్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పట్టణాభివృద్ధి ఒక ప్రణాళికా బద్ధంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా పట్టణాభివృద్ధి శాఖలో అనేక పరిపాలనా సంస్కరణలతో పాటు, పట్టణాభివృద్ధి దిశాదశను నిర్దేశించిన నూతన పురపాలక చట్టం, 2019 మరియు టీఎస్ఎల్ పాస్ చట్టం-2020 తీసుకురావడంతో పాటు జీహెఛ్ఎంసీ చట్టం, 1955 కి తగిన సవరణలు చేయబడ్డాయన్నారు. ఈ ప్రయత్నాలు ముఖ్య ఉద్దేశ్యం పాలనను మరింత సులభతరం చేసి పౌరసేవలను మెరుగుపరచి పుర పాలనను సమకాలీన పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమేనని తెలిపారు. ఇలాంటి ఆశయాల సాధనలో భాగంగానే జీహెఛ్ఎంసీ చట్టం 1955 మరియు తెలంగాణ పురపాలక చట్టం, 2019లో సెప్టెంబర్ 13, మంగళవారం శాసనసభలో సవరణలు ఆమోదించ బడ్డాయి:

జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ పురపాలక చట్టంలో ఆమోదించబడిన సవరణలు:

  • రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన జనాభా, విస్తీర్ణం మరియు వార్డుల సంఖ్యకు అనుగుణంగా కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. దీని ప్రకారం జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఉన్న కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను 5 నుండి 15కు, అదే విధంగా మిగతా కార్పొరేషన్లలో ఇట్టి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 5 నుండి 10 వరకు పెంచడం జరిగింది.
  • తెలంగాణ మునిసిపల్ చట్టం-2019 లోని సెక్షన్ 20(1) లో దొర్లిన పొరపాటును సరిచేస్తూ, మేయర్, డిప్యూటీ మేయర్ మరియు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబందించిన ఎన్నికప్రక్రియలో రాజ్యసభ సభ్యులకు కూడా బాగం కల్పించబడింది.
  • గత మునిసిపల్ చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న మాదిరిగా, తెలంగాణ మునిసిపల్ చట్టం 2019లో మేయర్‌, డిప్యూటీ మేయర్ మరియు చైర్మన్, వైస్ చైర్మనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి కావలసిన కనీస కాల పరిధిని ప్రస్తుతమున్న 3 నుండి 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
  • తెలంగాణ మునిసిపల్ చట్టం-2019 లోని మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బాగంగా, ఈవీఎం యంత్రాలను భద్రపరచడానికి, ఎన్నికల భద్రతా సిబ్బందికి బస కల్పించడం మొదలైన అవసరాలకు కూడా ఏదేని ప్రదేశాన్ని వశపర్చుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.
  • ప్రజా వెసులుబాటును మరియు స్థానిక ప్రజల, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్ పల్లి మునిసిపాలిటీ పేరును “రామకృష్ణాపూర్” మునిసిపాలిటీగా మార్చడం జరిగింది..

కొత్తగా ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు:

రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ‘ములుగు’ గ్రామపంచాయితీని పెరుగుతున్న పట్టణీకరణ మరియు భవిష్యత్ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమీప గ్రామాలైన బండారుపల్లి మరియు జీవంతరావు పల్లెలను. ములుగులో విలీనం చేస్తూ, కొత్తగా ములుగు మునిసిపాలిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 కి సవరణ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ మూడు (3) గ్రామ పంచాయతీలలో ఎన్నికైన పంచాయతీ సంఘాలు ఉన్నందు వల్ల వాటి కాల పరిమితి ముగిసిన తదనంతరం ఫిబ్రవరి 2, 2024 నుండి ఈ మూడు గ్రామాలు ములుగు మున్సిపాలిటీగా అవతరించనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =