వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు

Ministers TRS Mlas Complaint Against YSRTP Chief YS Sharmila to Assembly Speaker, TRS MLAs Complain Against Sharmila , YSRTP Chief YS Sharmila, YS Sharmila Comments On CM KCR, Mango News, Mango News Telugu, YS Sharmila , YS Sharmila Comments on KCR, YS Sharmila Derogatory Comments on KCR, CM KCR Latest News And Updates, YS Sharmila News And Live Updates, YSR Telangna Party, YSRTP

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడిన అనంతరం రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ ను కలుసుకుని వైఎస్ షర్మిలపై ఫిర్యాదు పత్రాన్ని అందించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలుగుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, వైఎస్ షర్మిల వ్యాఖ్యల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీ మహేంద్రరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − ten =