తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుద‌ల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana Education Minister Sabitha Indra Reddy Released SSC 2023 Results,Telangana Education Minister Sabitha Indra Reddy,Minister Sabitha Indra Reddy Released SSC 2023 Results,Telangana SSC 2023 Results,Mango News,Mango News Telugu,TS SSC Results 2023,TS SSC Results 2023 Live,ts ssc results 2023 manabadi,TS SSC Results 2023 Live Updates,TS SSC Results Latest News And Updates,TS SSC 10th Result 2023 LIVE,Telangana Education Latest News And Updates,SSC Results 2023

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు ఫలితాలు విడుద‌ల అయ్యాయి. ఈరోజు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితతో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీ దేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇక ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 86.80 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు చేసినట్లు వెల్లడించారు. అందులో బాలిక‌లు 88.53 శాతం ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు సాధించ‌గా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారని తెలిపారు. బాలిక‌లు బాలుర కంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణ‌త సాధించారని చెప్పారు. అలాగే ప్రైవేటు విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు చేశారని, వీరిలో బాలురు 43.06 శాతం, బాలిక‌లు 47.73 శాతం ఉత్తీర్ణ‌త సాధించారని తెలియజేశారు.

ఇక ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నామని, జూన్ 22 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు మే 26వ తేదీ లోపు సంబంధిత స్కూల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నామని వివరించారు. అలాగే రీ కౌంటింగ్‌కు రూ. 500ల చొప్పున చెల్లించి మార్కులు మ‌ళ్లీ లెక్కించుకోవ‌చ్చని, దీని కోసం ఫ‌లితాలు విడుద‌లైన ప‌దిహేను రోజుల్లో ఎస్‌బీఐ బ్యాంకులో చ‌లాన్లు చెల్లించి, దాన్ని బోర్డులో స‌మ‌ర్పిస్తే రీ కౌంటింగ్‌కు అవ‌కాశం ఇస్తారని, అయితే డీడీలు చెల్ల‌వు అని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కాగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యారు. వీరిలో రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు. 1,809 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేదు. అలాగే ప్ర‌యివేటు విద్యార్థులు 443 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఇక మంత్రి ఫలితాలను విడుదల చేసిన అనంతరం విద్యార్థులు https://results. tsbse.telangana.gov.in లేదా https//results. tsbsetelangana.org అనే వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా నిన్న ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here