తెలంగాణలో ‘మంకీపాక్స్‌’ కలకలం.. స్పందించిన హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Telangana Fever Hospital Superintendent Responds Over Health Condition of Suspected Kamareddy Monkeypox Patient, Fever Hospital Superintendent Responds Over Health Condition of Suspected Kamareddy Monkeypox Patient, Health Condition of Suspected Kamareddy Monkeypox Patient, Kamareddy Monkeypox Patient, Telangana Monkeypox Patient, Telangana Fever Hospital Superintendent, Fever Hospital Superintendent, Telangana first suspected Monkeypox case, Telangana Monkeypox case, TS Reports Suspected Monkeypox case, Telangana Monkeypox case News, Telangana Monkeypox case Latest News, Telangana Monkeypox case Latest Updates, Telangana Monkeypox case Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ‘మంకీపాక్స్‌’ కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తిలో వెలుగుచూడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కాగా ఈ నెల మొదటి వారంలో కువైట్‌కు వెళ్లొచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తిలో తీవ్ర జ్వరంతో పాటు కొన్ని ‘మంకీపాక్స్‌’ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు అతడిని అదనపు టెస్టుల కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రస్తుతం అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలో ఈ కేసుకి సంబంధించిన వివరాలను ఫీవర్‌ ఆస్పత్రి వైద్యాధికారులు సోమవారం వెల్లడించారు.

ఫీవర్‌ హాస్సిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘మంకీపాక్స్‌‘ అనుమానితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. పేషెంట్‌ నుంచి ఐదు రకాల శాంపిల్స్‌ తీసి పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, రేపు సాయంత్రం లోగా రిపోర్ట్‌ వస్తుందని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక అనుమానితుడి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచామని, వీరితో పాటు అతడితో సన్నిహిత సంబంధాలున్న మరో ఆరుగురిని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచినట్లు స్పష్టం చేశారు. గట్టిగా దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందుతుందని డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ఇక ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడగా, అందులో మూడు కేసులు కేరళలోనే నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − one =