దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారు – గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai Soundararajan Participates Convocation Ceremony of Secunderabad Military College,Telangana Governor Tamilisai Soundararajan,Secunderabad Military College,Tamilisai Soundararajan,Mango News,Mango News Telugu,India Vs China War,India Vs China Military,India Vs China Future War,India Vs China Military Strength 2022.India Vs China War 1967,India China,India Military Power,Defence Minister Of India,India Military News,China Vs India Military,China Vs India Military Power 2022,India Vs China Air Force,

భారతదేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం ఆమె సికింద్రాబాద్‌లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ ధ్రువ పత్రాలను అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విజయ్ దివస్ వేడుకల నేపథ్యంలో కాన్వకేషన్ జరుపుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని చెప్పారు. దేశంలో ప్రజలు ప్రశాంతమైన జీవితం గడపగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం మన సైనికులేనని తెలిపారు. రాత్రింబవళ్ళు వారు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, సైనికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఇక మన సైనికులు టెక్నాలజీ వినియోగంలో కూడా ముందుంటున్నారని, వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =