అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కోసం శాఖలన్ని సమాచారాన్ని తయారు చేయాలి

CS Somesh Kumar, CS Somesh Kumar held a Meeting on LAQs and LCQs, CS Somesh Kumar Meeting, legislative assembly, legislative assembly telangana, Legislative Council, legislative council of telangana, Somesh Kumar, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana Political Updates

ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సెప్టెంబర్ 3, గురువారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసనసభలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. సమావేశాల సందర్భంగా గౌరవ సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్ ను అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, వికాస్ రాజ్, రజత్ కుమార్, సునీల్ శర్మ, రవిగుప్త, సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =