బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేటితో ముగింపు, జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభ

Bandi Sanjay 5th Phase Padayatra Concluding Meeting to be held Today at Karimnagar BJP Chief JP Nadda will Attend,Bandi Sanjay 5th Phase Padayatra,Karimnagar BJP Chief JP Nadda,Telangana BJP Chief Bandi Sanjay,Mango News,Mango News Telugu,Bandi Sanjay's 5th Praja Sangrama Yatra,Praja Sangrama Yatra from 28th,Bhainsa to Karimnagar,Praja Sangrama Yatra,BJP Telangana Chief Bandi Sanjay,BJP Chief Bandi Sanjay,Bandi Sanjay,Bandi Sanjay Kumar,Praja Sangrama Yatra Latest News and Updates,Praja Sangrama Yatra News And Live Updates, Telangana BJP,BJP Party

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో చేపడుతున్న ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో (డిసెంబర్ 15, గురువారం) ముగియనుంది. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ నవంబర్ 29న భైంసాలో ప్రారంభించగా, గురువారం 18వ రోజున కరీంనగర్ లో ముగిస్తున్నారు. ఐదు విడతలో భాగంగా మొత్తం 18 రోజుల్లో 5 జిల్లాల్లో 222 కిమీ మేర బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్‌ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఐదోవిడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో ఈ సభను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. జన సమీకరణ సహా ఇతర అంశాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు, ఐదో విడత పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ఆవిర్భావం, ఢిల్లీ లిక్కర్ స్కామ్, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై జేపీ నడ్డా ఎలా స్పందించనున్నారు?, రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పై జేపీ నడ్డా ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.

జేపీ నడ్డా పర్యటన షెడ్యూల్:

  • గురువారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు జేపీ నడ్డా కర్ణాటక నుంచి హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.
  • 2.50 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30 గంటలకు కరీంనగర్ లోని హెలిప్యాడ్ వద్దకి చేరుకుంటారు.
  • 3.40 గంటలకు కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ వేదికకు చేరుకొని ప్రసంగించనున్నారు.
  • అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని, 5.35 గంటల నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =