బ్లాక్ ఫంగస్ చికిత్స: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యసేవలు పరిశీలించిన సీఎస్

Black Fungus, Black Fungus Disease, Black Fungus Guidelines, Black Fungus Infection, Black Fungus Infection Symptoms, Black Fungus Treatment, Govt Decides to Add More Hospitals for Black Fungus Treatment, Latest Breaking News 2021, Mango News, Mucormycosis, Telangana Black Fungus, Telangana CS Somesh Kumar, Telangana CSa, Telangana Govt Decides to Add More Hospitals for Black Fungus Treatment, Telangana Hospitals

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించి, పేషంట్లతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ పేషంట్లకు చేస్తున్న శస్త్రచికిత్సలు, అందిస్తున్న చికిత్సలను వైద్యులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించి, ప్రతి వార్డుకు వెళ్లి పేషంట్లకు అందిస్తున్న వైద్య సేవలు సీఎస్ గురించి తెలుసుకున్నారు. ఉత్తమ చికిత్సను అందించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను భయపడవద్దని కోరారు.

హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ హాస్పిటల్ ను బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం నోడల్ హాస్పిటల్‌గా గుర్తించి, 250 పడకలతో తగిన సౌకర్యాలు, మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు, ఈ ఆసుపత్రిలో 20 శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయని మరియు శస్త్రచికిత్సలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది కాకుండా సరోజినిదేవి కంటి హాస్పిటల్ లో కూడా చికిత్సలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వ్యాధి పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఈ పర్యటనలో సీఎం ఓఎస్డీ గంగాధర్, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి, మేజేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్ ఇతర అధికారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =