తెలంగాణలో వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు

Govt Increases Old Age Artists Pension, Mango News, Old Age Artists, Old Age Artists Pension, Old Age Artists Pension from the Existing Rs 1500 to Rs 3016, Old Age Artists Pension Increase News, Old Age Artists Pension Increased, Old Age Artists Pension Increased In Telangana, telangana, Telangana Govt Increases Old Age Artists Pension, Telangana Govt Increases Old Age Artists Pension from the Existing Rs 1500 to Rs 3016

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2021 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ పెన్షన్ పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 2661 మంది కళాకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

సీఎం కేసీఆర్ కళా ప్రియుడు, సాహితీవేత్త, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్ల వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, భాష వంటివి నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. రాష్ట్ర అవతరణ అనంతరం వీటి అభివృద్ధి కోసం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఎన్నెన్నో సాంస్కృతిక, సాహిత్య, కళా కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తూ కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామన్నారు. జానపద జాతర, రాష్ట్ర అవతరణ వేడుకలు వంటి ఉత్సవాల ద్వారా వేలాదిమంది కళాకారులకు కళాప్రదర్శనలకు అవకాశమిస్తూ కళాకారులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

జీవితాంతం కళాప్రదర్శనలోనే గడిపి, తమ జీవితాన్ని అంకితం చేసి, వృద్ధులు అయిన తర్వాత వారి సంక్షేమం కోసం వృద్ధ కళాకారుల పెన్షన్ ను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ పెన్షన్ మొత్తం కేవలం రూ.500 మాత్రమే ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ కళాకారుల పెన్షన్ ను 500 నుండి 1500 రూపాయలకు పెంచారని చెప్పారు. 2014 అక్టోబర్ నెల నుండి రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. మొత్తంగా 2661 మంది కళాకారులకు నెలకు 39.90 లక్షల చొప్పున సంవత్సరానికి 4 కోట్ల 78 లక్షల 80 వేల రూపాయలను అందిస్తున్నామని,  ఇప్పుడు పెన్షన్ రూ.3016 కు పెంచడంతో ప్రభుత్వం వీరి కోసం నెలకు 80 లక్షల చొప్పున సంవత్సరానికి 9 కోట్ల 62 లక్షల 71 వేలను ఖర్చు చేయనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 4 =